హామీలు నెరవేర్చేవరకు మీతోనే ఉంటాం..

190
KTR fires on congress
KTR fires on congress
- Advertisement -

ఖమ్మం జిల్లాలో మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం కార్పోరేషన్ నూతన కార్యాలయానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. కూరగాయలు, పండ్ల మార్కెట్, గోళ్లపాడు చానల్, రోటరీ నగర్-బోనకల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, జడ్పీ చైర్మన్, మేయర్ పాపాలాల్ పాల్గొన్నారు. గొల్లగూడెం రోడ్డులో బహిరంగసభ నిర్వహిస్తున్నారు.

ఈ సంధర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఆరు నెలల క్రితం ఖమ్మం పరిస్థితి చూసి కేసీఆర్ చలించి పోయారు. వాటికి పరిష్కారమే నేటి శంకుస్తాపనలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతిమాట నెరవేర్చేవరకు ఖమ్మం పట్టణ ప్రజలతోనే ఉంటాం. మీరు మాకిచ్చిన సగం టర్మ్‌లోనే ఎన్ని అభివృద్ది పనులు జరిగాయో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్ని వివిధ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని, వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తీసుకొచ్చాం. పేదింటి ఆడబిడ్డ మేనమామ సాయం చేస్తాడో లేదో కానీ.. మన సీఎం కేసీఆర్‌ ప్రతి పేదింటి ఆడబిడ్డకి రూ. 51 వేలను ఆర్థిక సాయంగా ఇవ్వడం గొప్ప విషయం.

ముఖ్యమంత్రి మనుమడు తినే సన్నబియ్యం పేదింటి విద్యార్థులకు అందించిన గొప్ప మనసున్న నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. 65 ఏళ్ల దరిద్రం, సమస్యలు తీర్చడానికి ఐదు ఏండ్లు సరిపోతాయని అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఖమ్మం జిల్లా నష్టపోయింది. ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలిపారు. గత పాలకులు ఎన్నో సమస్యలు వదిలిపెట్టి పోయారు. పల్లె నిద్ర పేరుతో కాంగ్రెస్ నాటకాలాడుతోందని విమర్శించారు. రాష్ట్ర సాధనలో కలిసి రానివారు అభివృద్ధిలో అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -