KTR:స్థానికులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే

13
- Advertisement -

తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తున్న సందర్భంగా గత పదేళ్లలో ఉపాధి కల్పనలో మేము చేసిన అభివృద్ధిని చెప్పాల్సిన అవసరముందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రతిపాదికనే తెలంగాణ ఉద్యమం జరిగింద్నారు.

ఉపాధి కల్పన రంగంలో కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను మీ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాను..ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం పై కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష చేశారు..అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను ఇష్టానుసారంగా తుంగలో తొక్కినయ్ అన్నారు.

జనరల్ కేటగిరీని నాన్ లోకల్ పేరుతో తెలంగాణ యువతకు ఎంతో అన్యాయం చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం..🔹భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ దాకా 95 శాతం ఉద్యోగాలను స్థానికులే ఇచ్చిన రాష్ట్రమేదైనా ఉందా?,కాంగ్రెస్, బీజేపీ లకు నేను సవాల్ చేస్తున్నా. దీనిపై సమాధానం చెప్పాలన్నారు.ప్రధాని వద్దకు వెళ్లి ఒత్తిడి తెచ్చి తెలంగాణలో స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్ దే..95 శాతం స్థానిక రిజర్వేషన్లు దేశంలో మన దగ్గర మాత్రమే ఉన్నాయన్నారు.

విద్యార్థులు, వారి తల్లితండ్రులు, నిరుద్యోగులు అంతా ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నా…🔹ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మన తొలి ముఖ్యమంత్రి కావటం కారణంగానే ఇది సాధ్యమైంది…ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు మొత్తం రాష్ట్రంలో పదేళ్లలో వారు భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 24,086 మాత్రమేఅన్నారు.అందులో 42 శాతం తెలంగాణను అనుకుంటే మనకు వచ్చింది 10 వేలు మాత్రమే. ఏడాదికి వెయ్యి ఉద్యోగాలే…కేసీఆర్ గారు ఉద్యోగాలే ఇవ్వలేదంటూ కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్లు అర్థం చేసుకోవాలన్నారు.కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో 2,32,308 ఉద్యోగాలకు పరిపాలన అనుమతులు ఇచ్చిందన్నారు.అందులో 2,0 2, 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయటం జరిగిందన్నారు.

Also Read:కీలక షెడ్యూల్‌లో శర్వా 37!

- Advertisement -