21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతి..

28
- Advertisement -

దేశంలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. టీఎస్‌ బీపాస్‌ దేశంలోనే ఎక్కడా లేదన్నారు.

ప్రజల కోరిక మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని తెలిపారు. హిమాయత్‌సాగర్‌ కాలుష్యం కాకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. ధరణి వచ్చాక చిన్న భూమిని కూడా మ్యాచ్‌ చేశామని తెలిపారు. ఒకవేళ పర్మిషన్‌ రాకుంటే ఆటోమేటిక్‌గా ఇచ్చినట్టే పరిగణించాలని తెలిపారు. టీఎస్‌ బీపాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. గృహ నిర్మాణ శాఖ రద్దుచేసి.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -