టాలీవుడ్ లో సోషల్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కమర్షియల్ సినిమాల్లో చిన్న సోషల్ ఎలిమెంట్స్ ఉన్నా వాటిని హైడ్ చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ డామినేట్ చేస్తాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ దనుష్ స్ట్రైట్ సోషల్ డ్రామా సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగులో ఏటరీ ఇస్తున్నాడు దనుష్. షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ నెల 17 న తెలుగు , తమిళ్ లో సినిమా రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే టీజర్ , సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా ట్రైలర్ తో ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమాలో విద్యా వ్యవస్థ ను ప్రశ్నించబోతున్నాడు దనుష్. విద్య వ్యవస్థలో ఉండే లొసుగులతో ఈ సినిమా తెరకెక్కింది. వెంకీ అట్లూరి దర్శకుడు. సీతార , ఫార్చ్యూన్ బేనర్స్ నిర్మించాయి.
దనుష్ కి తెలుగులో కొంత మార్కెట్ ఉంది. రీసెంట్ గా తీరు కూడా ఇక్కడ మంచి సక్సెస్ సాదించింది. దీంతో సార్ తెలుగులో మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. మరి సార్ గా దనుష్ ఎలా మెప్పిస్తాడో ?
ఇవి కూడా చదవండి..

