ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలిః మంత్రి కొప్పుల

314
koppula eshwar
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని కొప్పుల పిలుపునిచ్చారు మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేట్ కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని మల్కాపూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్ లు పాల్గోని మొక్కలు నాటారు.

ఈసందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండువందల ముప్పై కోట్ల మొక్కలను నాటాల్సి ఉండగా ఇప్పటివరకు నూట ఎనభై రెండు కోట్ల మొక్కలు నాటినట్టు మంత్రి తెలిపారు.6వ విడిత హరితహారం లో నాటే మొక్కలతో ఎంచుకున్న లక్ష్యం పూర్తి అవుతుందని కొప్పుల అన్నారు. వాతావరణం లో సమతుల్యత పెరగలన్న, వర్షాలు వృద్ధిగా కురువలన్న, కోతులు వాపస్ పోవలన్న మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం లో అందరూ బాగస్వామ్యులై మొక్కలను నాటాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు.

- Advertisement -