హరితహారంలో రెండోస్థానంలో సిద్దిపేట..

24
- Advertisement -

తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు మంత్రి హరీష్ రావు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆ పిలుపు మేరకు ఒకేరోజు కోటి మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిద్ధిపేట శివారు రంగనాయక సాగర్ తెలంగాణ తేజోవనంలో 30వేల మొక్కలు నాటారు. హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 273.33 కోట్లు మొక్కలు నాటి, దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులో నిలిచిందని కేంద్రం పార్లమెంటులో చెప్పిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో పాటు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

Also Read:Baby:ఓటీటీ రెస్పాన్స్ అదుర్స్

- Advertisement -