రైతులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు- మంత్రి కొప్పుల

283
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఉన్నతస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన కరీంనగర్ క్యాంపు కార్యాలయం నుండి జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, జగిత్యాల కోరుట్ల చొప్పదండి వేములవాడ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకే రవిశంకర్, రమేష్ బాబు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావా వసంత, అదనపు కలెక్టర్ రాజేశం తో పాటు DAO,DSO PACS చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మొత్తం 50 మందితో ఒకేసారి దాదాపు గంటసేపు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతస్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు టెలి కాన్ఫరెన్స్ ద్వారా కోరారు. ఈ సీజన్లో మెడ విరుపు అగ్గి తెగులుతో ధాన్యం నాణ్యత తగ్గిందని అదేవిధంగా 1153, 1156,బతుకమ్మ రకం విత్తనం వేయడం వల్ల గట్టి తప్ప,తలు ఎక్కువగా వచ్చిందన్నారు ఇటువంటి ధాన్యం కూడా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు రైస్ మిల్లర్లకు తగువిధంగా నచ్చజెప్పి సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో మిల్లర్లు రైతులు ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.

ఈ సమయంలో రైస్ మిల్లర్లు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మిల్లర్లు వ్యాపారం దృక్పథంతో కాకుండా సేవా భావంతో కొనుగోలు చేయాలన్నారు.అదే సమయంలో నష్టం కలగకుండా చూసుకోవాలన్నారు సీఎం కేసీఆర్ ప్రణాళికబద్ధంగా చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పంట దిగుబడులు పెరిగాయన్నారు. ధాన్యం కొనుగోలు కోసం సీఎం కేసీఆర్ రైతులు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 30 వేల కోట్లు సమకూర్చడం సాహసోపేతమైన నిర్ణయం అన్నారు రైతులు కూడా ధాన్యంలో తేమ,తలు, తప్ప విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల పాటించాలని కోరారు ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు.

ఇంతటి క్లిష్ట పరిస్థితులలో చిల్లర రాజకీయాలు తగవు తెలంగాణ సర్కార్ ఓవైపు కరోనా పరిస్థితులను అధిగమిస్తు మరోవైపు రైతు సంక్షేమం కోసం ఆలోచిస్తూ వారికి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటే. ప్రతిపక్ష నాయకులు తల తోక లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తగదని అన్నారు. అలాగే ఎంపీ బండి సంజయ్ దీక్షల పేరుతో రైతుల తప్పుదోవ పట్టించడం ఎంత మాత్రం సరికాదన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా ఇంతటి క్లిష్ట పరిస్థితులలో చిల్లర రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు.

- Advertisement -