ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి- మంత్రి కొప్పుల

192
Minister Koppula Eshwar
- Advertisement -

ఎస్సీల సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. సోమవారం ఆయన ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఎస్సీల సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నది. ఇందుకు సంబంధించి పలు పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నాం అని మంత్రి తెలిపారు.

ఎస్సీ సంక్షేమం, వికాసానికి ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. నోడల్ ఏజెన్సీ లో భాగంగా ఉన్న ఆ యా శాఖల ఉన్నతాధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలి. అధికారులు, ఉద్యోగులు సేవాభావంతో ముందుకు సాగాలి అని మంత్రి సూచించారు.ఈ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించగా, ప్రభుత్వ ఉన్నతాధికారులు రాహూల్ బొజ్జ, విజయ్ కుమార్,యోగితారాణ, వాకాటి కరుణ,శ్రీదేవి, సయ్యద్ ఒమర్ జలీల్, కరుణాకర్, హన్మంతు నాయక్ హాజరయ్యారు.

- Advertisement -