ఈటలపై మంత్రి కొప్పుల ఫైర్‌..

109
- Advertisement -

ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమెందుకు, మళ్లీ అందుకోసమే పోటీ చేయడం ఎందుకు అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎద్దేవ చేశారు. ఈరోజు జమ్మికుంట పట్టణంలోని 30వ వార్డుకు చెందిన బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు 200 మంది మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య,లావణ్య, టిఆర్ఎస్ నాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు గాను 60కోట్ల రూపాయలు మంజూరు చేశాం..వాటి పనులు కొనసాగుతున్నాయి.

18ఏండ్లు జరగని అభివృద్ధి పనులు 18 రోజులలోనే పూర్తవుతాయి, కొద్దిగా ఓపిక పట్టండి. తాగునీటి సమస్య దేశమంతటా ఉంది. అయితే, ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యల గురించి బాగా అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ అందరికి పరిశుద్ధమైన మంచినీళ్లు అందిస్తున్నరు. కాళేశ్వరంతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సుమారు కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తున్నం. దేశంలో మరెక్కడా లేని విధంగా 24గంటలు కరంటు అందిస్తున్నం.. రాష్ట్రంలో సుమారు 40లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నం.. అమ్మ ఒడి, కెసిఆర్ కిట్ ల ద్వారా మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం సాయం చేస్తున్నది అని మంత్రి పేర్కొన్నారు.

ఇక ఈటల టిఆర్ఎస్‌లో చేరే నాటికే ఇక్కడ టిఆర్‌ఎస్‌ బలమైన పార్టీ. దామోదర్ రెడ్డి బలమైన నాయకుడు అయినా కూడా కెసిఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుండడంతో తెలంగాణ కోరే వారంతా ఈటలను గెలిపించిండ్రు. ఈటల నీ వ్యక్తిగత స్వార్థం కోసం,అవసరాల కోసం పార్టీ మారి ఆత్మ గౌరవం అనడం సమంజసం కాదు అని మంత్రి కొప్పుల దుయ్యబట్టారు. ఈటల బిజెపిలోకి పోయిండు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అందుకే ఆ పార్టీలో చేరాడు. ఇక కేంద్రం పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ ధరలు పెంచడంతో నిత్యావసరాలు ధరలు కూడా బాగా పెరిగిపోయి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నరు. తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతున్నది,ఇంకా చెందుతది. ఈ అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తున్నది,ఇక ముందు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే మరింత ప్రగతి సాధ్యం అన్నారు.

ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమెందుకు, మళ్లీ అందుకోసమే పోటీ చేయడం ఎందుకు.. డబ్బులు ఖర్చు పెట్టేది ఆయనే,బొట్టు బిళ్లలు, గొడుగులు,కుట్టు మిషన్లు పంచేది ఆయనే. రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తుండు. నిజమైన, నిఖార్సయిన పార్టీ టిఆర్‌ఎస్‌. అప్పుడు తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్, కెసిఆర్.. ఇప్పుడు గొప్పగా అభివృద్ధి చేస్తున్నది టిఆర్ఎస్, కెసిఆరే అని మంత్రి తెలిపారు. గెల్లు శ్రీనివాస్ టిఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిండు. కారు గుర్తుకు ఓటేసి, టిఆర్ఎస్ కు,గెల్లు ఘన విజయం చేకూర్చండి.. మీకు అమూల్యమైన సేవలందించే అవకాశం ఇవ్వండి..కెసిఆర్ కు,ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెల్పండి అని మంత్ర ప్రజలను కోరారు.

- Advertisement -