కాంగ్రెస్ చచ్చిన పాము..:మంత్రి జగదీష్ రెడ్డి

143
jagadish reddy
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అని ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి… ఏడేళ్ల కాలంలో మోదీ చేసిందేమిటో… తెలంగాణలో కేసీఆర్ చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల ఆదాయం తుంచేసింది బీజేపీయేనన్నారు.

త్యాగాల, పోరాటాల పురిటిగడ్డగా నిలిచిన ఈ జిల్లాలో పోరాట వారసులం తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లక్షా 31వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మోదీ కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు.

- Advertisement -