Congress:ఆటో డ్రైవర్లను ఆదుకునేదెప్పుడు?

11
- Advertisement -

తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మహిళలంతా బస్సు ప్రయాణాన్నికి మొగ్గు చూపుతుండడంతో ఆటోలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దాంతో తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు గత కొన్నాళ్లుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్ళు తెరిపించేందుకు ఆటోడ్రైవర్లకు అండగా ప్రతిపక్ష బి‌ఆర్‌ఎస్ పార్టీ నిలిచింది. తాజాగా జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాల్లో ఆటోడ్రైవర్ల ఆవేదనను వినిపించేందుకు బి‌ఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల ప్రస్తావన వాడి వేడి చర్చలకు దారి తీస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల రోడ్డుపాలైన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతి నెల రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు. .

అలాగే జీవన భారంతో ఇప్పటికే ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని. అందువల్ల వారి కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటు ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు ఉండడంతో ప్రభుత్వ తీరుపై సామాన్యులు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. ప్రజా పాలన అందిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏ రకంగా ప్రజాపాలన అందిస్తుందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సమస్య పరిష్కారానికై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా ? ఆటోలలో శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లకూడదా ? గతంలో లేని ఆంక్షలు, నిర్బంధాలు ఇప్పుడెందుకు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తంమీద ఆటో డ్రైవర్ల విషయంలో బి‌ఆర్‌ఎస్ అండగా నిలవడంపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/BRSHarish/status/1755840520784593126?s=20

- Advertisement -