పాత అసెంబ్లీ భవనానికి మరమ్మత్తులు

27
assembly

హైదరాబాద్ నగరంలోని తెలంగాణ శాసనసభ పాత భవనంలో పెచ్చులు ఊడుతున్నాయని కొన్ని వార్తా ఛానళ్లలో వార్తలు ప్రసారం అవుతున్నాయని తెలిపారు శాసనసభ కార్యదర్శి డా. వి.నరసింహా చార్యులు.

అసెంబ్లీ పాత భవనం నిర్మించి వందేళ్ళకు పైగా అయింది. అప్పటి టెక్నాలజీ ప్రకారం డంగు సున్నం తో నిర్మించారు. కాలక్రమంలో ప్రతి ఏడాది గోడలు, సీలింగ్ నుండి సున్నం, గచ్చు పెచ్చులు జారడం సహజం. అసెంబ్లీ ఇంజనీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రతి ఏడాది మరమ్మతులు చేపడతుందన్నారు.

ప్రధాన స్ట్రక్చర్ లో ఎలాంటి ఇబ్బందులు లేవు. పటిష్టంగా ఉన్నది. అధికారులు, ఇంజనీరింగ్ విభాగం నిత్యం శాసనసభ భవనంతో పాటుగా అనుబంధ కార్యాలయాలు ఉన్న భవనాలను పరిశిలిస్తారని చెప్పారు. పాత శాసనసభ భవనాన్ని ఎల్లవేళలా, అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన మేరకు మరమ్మతులు చేపడుతున్నామని వెల్లడించారు.