బడ్జెట్‌-2019:ధరలు పెరిగే.. తగ్గే వస్తువులు ఇవే..!

265
budget nirmala
- Advertisement -

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.. ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయని ఆమె, తొలిసారి గృహ రుణం తీసుకుని ఇల్లు కట్టుకునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

దీంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.1 పెంచుతున్నట్లు తెలిపిన ఆమె, బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని 10శాతం నుంచి 12.50శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. తాజా బడ్జెట్‌ వివిధ వస్తువుల ధరలపై ప్రభావ చూపనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులివి!

ధరలు పెరిగేవి.. బంగారం,జీడిపప్పు,రసాయనాలు,ప్లాస్టిక్, పీవీసీ పైపులు,రబ్బర్,ప్లాస్టిక్స్ ఫ్లోర్ కవర్లు,న్యూస్‌ప్రింట్,ప్రింటెడ్ బుక్స్‌,సెరామిక్ ఉత్పత్తులు,సెరామిక్ రూఫింగ్ టైల్స్,స్టీల్, మెటల్ ఉత్పత్తులు,స్టెయిన్‌లెస్ ఉత్పత్తులు,లౌడ్‌స్పీకర్లు,మ్యాగజైన్లు,వాహనాల లైట్లు,సిగరెట్లు,హుక్కా, గుట్కా, జర్దా ఉత్పత్తులు,పెట్రోలియం ఉత్పత్తులు,పెట్రోల్,డీజిల్,ఏసీలు,సీసీటీవీ కెమెరా,ఆప్టికల్ ఫైబర్,గ్లాస్ అద్దాలు,దిగుమతి చేసుకునే పుస్తకాలు.

ధరలు తగ్గేవి.. మొబైల్ ఫోన్ల కెమెరాలు,మొబైల్ ఫోన్ల ఛార్జర్లు,లిథియమ్ అయాన్ బ్యాటరీలు,సెట్‌టాప్ బాక్స్,ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు,నాఫ్తా,గృహ రుణాలు,రక్షణ సామగ్రి,రిఫ్రిజిరేటెడ్ హీలియం లిక్విడ్,సిలికా రాడ్లు, ట్యూబులు,టెక్స్‌టైల్,ఉన్ని వస్తువులు,స్టీల్.

- Advertisement -