అర్బన్ ఫారెస్ట్‌లతో ఆహ్లాదకర వాతావరణం: ఇంద్రకరణ్ రెడ్డి

25
indrakaran reddy

అర్బన్ ఫారెస్ట్‌లతో నగర, పట్టణ వాసులకు మానసిక ఉల్లాసంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు తోడ్పడుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నేర‌డిగోండ మండ‌లం బోథ్ ఎక్స్ రోడ్ వ‌ద్ద‌ జాతీయ ర‌హ‌దారి స‌మీపంలోని కుంటాల సోమ‌న్న హ‌రిత‌వ‌నం (అర్బ‌న్ ఫారెస్ట్) పార్కుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శంఖుస్థాప‌న చేశారు.

సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేర‌కు కోటి వృక్షార్చ‌నలో పాల్గొని మొక్క‌లు నాటి, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎక‌రం స్థ‌లంలో హ‌రిత హోట‌ల్ ఏర్పాటుకు ఇప్ప‌టికే ప్ర‌తిప్రాద‌న‌లు రూపొందించామ‌ని, అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు.

ప్ర‌కృతి అందాల‌కు నిల‌యంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల‌, పొచ్చెర జ‌ల‌పాతాల‌కు స‌మీపంలో ఫారెస్ట్ పార్కును అభివృద్ది చేస్తున్నామ‌న్నారు. ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు ఆహ్లాదాన్ని అందించేలా పార్కును తీర్చి‌దిద్ద‌నున్న‌ట్లు తెలిపారు.