- Advertisement -
సంగారెడ్డి జిల్లా ఆర్.సి. పురం మండలం మయూరి నగర్ కరోన పై స్థానికులకు అవగాహన కల్పించారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…మయూరి నగర్ లో రెండు కరోన పాజిటివ్ నమోదు అయ్యాయని వెల్లడించారు. ఈ ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్నారు…కరోన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తామని వెల్లడించారు.
స్థానికులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని…అన్ని సౌకర్యాలు కలిపిస్తాము, ఎవరు ఇండ్ల నుండి బయటకు రావద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -