స్వీయ నియంత్రణ పాటించి కరోనాను తరిమికొట్టండని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షల మంది మొదటి డోసు తీసుకున్నారు. రెండో డోసు కోటి 30 లక్షల మంది మాత్రమే తీసుకున్నారు. చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా నిబంధనలు పాటిస్తే ఏ మైక్రాన్ కూడా మన వద్దకు రాదు. డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరియంట్ ఏది కూడా మన దరి చేరదు. కొంచెం జాగ్రత్త ఉంటే కరోనాను అరికట్టొచ్చు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అని హరీశ్‌రావు కోరారు.
ఒమిక్రాన్ తెలంగాణకు రాలేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. టీకాలు సురక్షితమైనవి. అనుమానాలు, అపోహాలు అవసరం లేదు. రెండు డోసులు తీసుకుంటే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. 18 ఏండ్లు దాటి ప్రతిన ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలి. టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు.