ప్రజస్వామ్యం అంటే బీజేపీకి లెక్కలేదు: ఎంపీ కేకే

70
kk

పార్లమెంట్ ప్రజాస్వామ్యం అంటే బీజేపీకి లెక్కలేదన్నారు ఎంపీ కేశవరావు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విపక్షాల డిమాండ్ చేయగా విపక్షాల ధర్నాకు పోటీగా పలువురు బిజెపి ఎంపీల ధర్నా చేపట్టారు. దీంతో పోటా పోటీ నినాదాలతో పార్లమెంట్ ఆవరణ మార్మోగిపోయింది.

ఈ సందర్భంగా మాట్లాడిన కే. కేశవరావు…అధికార పక్ష గుండాగిరిని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. గడచిన నాలుగు రోజులు నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం…విపక్షాలు వాకౌట్ చేసినా సభ నడుపుకుంటు బిల్లులు ఆమోదించుకుంటున్నారని మండిపడ్డారు. సభలో చేసినట్లే ఇక్కడ కూడా గుండాగిరి చేస్తున్నారు..విపక్ష ఎంపీల ఆందోళన వద్దనే బీజేపి ఎంపీల ఆందోళన చూస్తుంటే మోడీ మైండ్ సెట్ అర్ధం అవుతుందని దుయ్యబట్టారు. వాస్తవానలు లెవనెత్తితే బీజేపీ భయపడుతోందన్నారు.