అధైర్య పడొద్దు..ఆదుకుంటాం:రైతులతో హరీశ్

43
- Advertisement -

అకాల వర్షాలు రైతులను కొలుకోలేని దెబ్బ తీశాయి. చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలైంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి, పొన్నాల గ్రామంలో అకాల వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు మంత్రి హరీశ్‌ రావు.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని ,సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

Also Read:‘ఎన్టీఆర్ 30’.. మళ్లీ లీకుల కలకలం

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్‌లోనే వరి నాట్లు వేసి, కోతలు పూర్తి చేసి నష్టం నుంచి బయట పడ్డారన్నారు. భవిష్యత్తులో ఒక్క నెల ముందుకు సీజన్ తేవడానికి రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.

Also Read:ఎన్టీఆర్‌కి హాలీవుడ్ దిగ్గజం ఫిదా

- Advertisement -