ఎన్టీఆర్‌కి హాలీవుడ్ దిగ్గజం ఫిదా

33
- Advertisement -

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అతను టాలెంట్ కి నటీనటులంతా ఫిదా అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి.. ఓ తెలుగు హీరో నటనకి ఫిదా అవ్వడం తెలుగువారందరికీ గర్వకారణం. జేమ్స్ గన్ తదుపరి చిత్రం ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్’. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న జేమ్స్ గన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఓ భారతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జేమ్స్ గన్ మాట్లాడుతూ.. ‘RRR నుండి చాలా మంచి నటుడ్ని చూశాను. అతని పేరు జూనియర్ ఎన్టీఆర్. పంజరంలో నుంచి పులులు అన్ని దూకుతునప్పుడు అతను కూడా ఓ పులిలానే కనిపించాడు. వాట్ ఏ యాక్టింగ్. తన నటనకు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను ఏదో ఒక రోజు తనతో పని చేస్తాను. నాకు తనతో వర్క్ చేయాలని ఉంది. అతను అద్భుతమైన నటుడు. చాలా కూల్ కూడా’ అని జేమ్స్ గన్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read:IPL 2023:బెంగళూరు తో కోల్ కతా.. ఢీ!

జేమ్స్ గన్ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఓ ప్రముఖ దర్శకుడు, తమ అభిమాన నటుడి పై ఇలా ప్రశంసలు కురిపించడంతో తారక్ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. నిజానికి గ్లోబల్ వైడ్ గా బ్లాక్‌ బస్టర్ అయిన ‘RRR’ లో రామ్ చరణ్ ఒక్కడే మెయిన్ లీడ్‌ అన్నట్టు ప్రమోట్ చేశారు. కానీ, సమయం గడిచే కొద్దీ జూనియర్ ఎన్టీఆర్‌ నటనకు హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు వస్తోంది.

Also Read:

కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు

- Advertisement -