వేయి మందితో బాలయ్య కొట్టుడు

33
- Advertisement -

బాలయ్య సినిమా అంటేనే యాక్షన్ సమ్మేళనం. సీన్స్ కంటే ఎక్కువగా ఫైట్లే ఉంటాయని సెటైర్ కూడా ఉంది. ప్రస్తుతం బాలయ్యతో కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘NBK 108’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఐతే, ఈ సినిమాలోని ఓ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దాదాపు వేయి మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను బాలయ్య పై ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇరవై మంది వుంటే భారీ ఫైట్ అనేవాళ్ళు. మగధీరలో రాజమౌళి ఈ లెక్క వందకి చేర్చాడు. ఆ తర్వాత వంద కూడా దాటేసే భారీ యాక్షన్ సీన్లు తెరపై కనిపిస్తూ వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ లాంటి చిత్రాల్లో వందల మందిని హీరో కొట్టుకుంటూ పోతాడు.

అందుకే, ఇప్పుడు బాలయ్య వేయి మందిని కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి అందుకు తగ్గట్టుగానే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను డిజైన్ చేశాడు. ఈ సీన్ లో 1000 మంది ఫైటర్స్ కనిపిస్తారట. బాలయ్య సినిమాల్లో యాక్షన్ భీవత్సంగా వుంటుంది. అనిల్ రావిపూడికి కూడా యాక్షన్ అంటే ఇష్టం. అందుకే, 1000 మందితో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు. వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచే ఈ ఫైట్ చిత్రీకరణ ప్రారభించనున్నారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ ఫైట్ ని షూట్ చేస్తారట.

Also Read:అధైర్య పడొద్దు..ఆదుకుంటాం:రైతులతో హరీశ్

బాలయ్య ‘అఖండ’ సినిమాకి అదిరిపోయే యాక్షన్ అందించిన స్టంట్ శివ.. ఈ ఫైట్ కి యాక్షన్ కొరియోగ్రఫర్ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, సిరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం నటసింహ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:‘ఎన్టీఆర్ 30’.. మళ్లీ లీకుల కలకలం

- Advertisement -