దేశంలో ఆందోళనకరంగా రైతుల పరిస్థితి: హరీశ్

202
harishrao
- Advertisement -

దేశంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది…. సీఎం కేసీఆర్ ముందు చూపు వల్లే రాష్ట్రంలో రైతులకు కొంత ఊరటగా ఉందన్నారు మంత్రి హరీశ్‌ రావు.మెదక్ పట్టణంలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రైతు వేదికను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతుల సమావేశంలో మాట్లాడిన హరీశ్‌ రావు… గతంలో వ్యవసాయం అంటే రైతుల ఆత్మహత్యలు కరెంటు కోతలు ఉండేవి. దేశంలో కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడ రైతులకు ఉచిత కరెంటు పెట్టుబడి సాయం ఎక్కడా లేదన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాల విషయంలో ఏ రాష్ట్రం సరిసమానంగా లేవు…. దేశంలో ఏ పథకమైనా మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలులో ఉన్నాయన్నారు.

మూడు సంవత్సరాల్లో కాలేశ్వరం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది. తెలంగాణ పథకాలను బీజేపీ ప్రభుత్వం కాఫీ కొడుతుంది. రైతులను రాజు చెయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గత పాలకులు తాగడానికి నీరు కూడా ఇవ్వలేదు. గత పాలకుల వ్యవసాయం దండగన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయానికి పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు.

70 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఏడు సంవత్సరాల్లో తీసుకొచ్చి దేశంలోని ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో వాణిజ్య పంట పై రైతులకు అవగాహన కల్పించాలి. నెలకు వెయ్యి కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు కొసం ఖర్చు చేస్తున్నాం. కందులకు 6 వెల రూపాయలు వచ్చే వరకు ఎవరు అమ్మకూడదు. 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు రైతుల కోసం నిర్మించాం. తెలంగాణలో 50 లక్షల ఎకరాలలో యాసంగి పంట సాగు చేస్తున్నారు. మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

- Advertisement -