టీచర్స్ డే.. ఉపాధ్యాయులకు విషెస్‌ తెలిపి మంత్రి హరీష్‌

73
harish

ఈ రోజు టీచర్స్‌ డే సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీష్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ భౌతిక తరగతులు లేకున్నా.. ఆన్‌లైన్‌ క్లాసులతో బోధనకు అంతరాయం కలగకుండా కృషిచేశారని వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ తెలంగాణలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యావిధానంలో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ విద్యా బోధన చేయాలని సూచించారు.