చిరు డైరెక్టర్‌తో నితిన్‌ మూవీ..!

42
nithin

యూత్‌స్టార్‌ నితిన్ ప్రస్తుతం మాస్ట్రో అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీల్లో విడుదలకానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 17న హాట్ స్టార్ స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ నిర్మించిన ఈ చిత్రానికి రూ.32 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నారు.నితిన్ సరసన నభా నటేష్ నటించింది.

ఇక ఇదిలా ఉంటే నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాను ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో సినిమాను కూడా ఓకే అన్నట్లు సమాచారం. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను నితిన్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.