మల్లన్నసాగర్ పూర్తి.. సిద్దిపేటకు వరం: మంత్రి హరీష్‌

196
Minister Harish Rao Speech At Siddipet
- Advertisement -

బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పురపాలక సంఘం ప్రత్యేక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బడ్జెట్ ఆమోదం పొందిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నెలకు మంచి నీళ్లకోసం కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఏడాదికి వచ్చే ఆదాయం మూడు కోట్లు మాత్రమే. అయితే మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి అవుతే సిద్దిపేటకి మంచి నీరు తెచ్చుకుంటే ఖర్చు తగ్గుతుంది అని మంత్రి తెలిపారు.

సిద్దిపేటకి త్రాగునీరు కోసం నాబార్డ్ ద్వారా 380 కోట్లు మంజూరు చేసుకుందాం.మల్లన్న సాగర్ పూర్తి అవుతే సిద్దిపేట త్రాగునీరుకి వరం అవుతుంది. ప్రతి ఇంటికి త్వరగా నల్ల కనెక్షన్లు ఇవ్వాలి, కొత్త కాలనీల్లో త్వరగా పూర్తి చేయాలన్నారు. సిద్దిపేటలో నల్ల కనెక్షన్లు లేని ఇల్లు ఉండకూడదు. ఇక మిగులు బడ్జెట్‌తో బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసే విధంగా సిద్దిపేట మున్సిపాలిటీ ఎదగాలి. మిగిలిపోయిన యుజిడి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలనీ, మున్సిపల్ ఇంజనీర్ల పై మంత్రి మండిపడ్డారు. వర్షాకాలం లోపు యుజిడి పూర్తి చేస్తే దోమలు, ఈగలు, కరోనా బారి నుండి తప్పించుకోవచ్చు మంత్రి హరీష్‌ అధికారులకు సూచించారు.

- Advertisement -