కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు- హరీష్‌

181
harish
- Advertisement -

మిరుదొడ్డి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ గెలిస్తే బాయికాడ మీటర్లు కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయి. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తామని అనడం సిగ్గుచేటు. బీహార్‌లో ఉచితంగా కరోనా మందును పంపిణీ చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా పంపిణీ చేస్తారు? ముంపు ప్రభావిత గ్రామాలు సైతం టీఆర్ఎస్‌కు ఏకగ్రీవంగా మద్దతు పలుకుతున్నయని మంత్రి అన్నారు.

దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయసాధనకు అభ్యర్థి సుజాత ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. సంక్షేమ పథకాలు, ప్రజా అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శం. దివంగత మాజీ మంత్రి ముత్యం రెడ్డి హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను బదులుగా అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు మరో 30 వేల రూపాయలు చెల్లించడంతో రైతులపై భారం పడేది. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో తాను భాగస్వామినై సిద్ధిపేట తరహాలో కృషి చేస్తానని మంత్రి హరీష్‌ హామీ ఇచ్చారు.

- Advertisement -