బీజేపీ, ఎంఐఎంలు నీచ రాజకీయలు చేస్తున్నాయి- హరీష్‌

200
harish
- Advertisement -

గురువారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి నగర్( 111) డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డికి మద్దతుగా బిహెచ్ఈఎల్ ఎంఐజి కాలనీలో జరుగుతున్న బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు, మంత్రి తోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా వల్ల డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం లేటు అయింది. ఇండ్లు లేని వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు కేటాయిస్తాము.ఇంటి ఇంటికి నల్ల పెట్టి తాగునీరు ఇచ్చాము…ఇప్పుడు నల్ల బిల్లు రద్దు చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు. సింధు ఆదర్శ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించండి.. సీఎం, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి 111 డివిజన్ గౌరవం పెంచే భాద్యత తీసుకుంటను. భారతి నగర్ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని మంత్రి హామీ ఇచ్చారు.

బీజేపీ వాళ్ళు హైదరాబాద్ మీద సర్జికల్ స్టైక్ చేస్తే ఏమి వస్తుంది. బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్ల కోసం నీచ రాజకీయలు చేస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అభివృద్ధి, చేయవలసిన అభివృద్ధి గురుంచి చెప్పకుండా కూల్చుతం, కాల్చుతం అని ప్రచారం చేస్తున్నారు. వరద బాధితులకు ఇచ్చే సహాయంను ప్రతిపక్షలు కుడా అడ్డుకున్నారు. నేను ఆర్థిక మంత్రిగా చెబుతున్న ఎన్నికల ఫలితాల తర్వాత వరద సహాయం అందని ప్రతి ఒక్కరికి సహాయం ఇస్తామన్నారు.

ప్రశాంత హైదరాబాద్ కావాలా…విధ్వంస హైదరాబాద్ కావాలా ప్రజలు ఆలోచించండి.టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం.బిహెచ్ఈఎల్ సంస్థ కు 40 వేల కోట్ల ఆర్డర్ ను ఇచ్చింది సీఎం కేసీఆర్ ఇచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ వల్ల బిహెచ్ఈఎల్ మూతబడకుండా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే భాద్యత సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారు.సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లి
బిహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు పింఛను ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ అమెజాన్ కంపెనీ 21 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఉస్మాన్ నగర్ లో ఐటీ పార్కు, సుల్తాన్ పూర్‌లో మెడికల్ డివైస్ పార్కు ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గత 5 ఏళ్లతో జరిగిన అభివృద్ధి చూసి హైదరాబాద్ భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్యలు ఉంటే పెట్టుబడులు ఆగిపోతాయి. కరోన, భారీ వర్షాల కష్ట సమయల్లో ప్రజలతో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -