వాణిదేవిని అందరి సహకారంతో గెలిపించుకోవాలి- మంత్రి హరీష్‌

51
minister harish

హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభీ వాణిదేవికి మద్దతుగా మియాపూర్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి శుక్రవారం మంత్రి హరీష్ రావు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన అభ్యర్థి చాలా సాదాసీదాగా ఉన్న వ్యక్తి, లక్ష మందికి విద్యను అందించిన ఒక విద్యావేత్త, మాజీ ప్రధాని పివి నర్సింహ రావు బిడ్డగా ఆయనతో అనేక దేశాలు తిరిగి అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, పోటీచేసే అభ్యర్థులలో ఒకే ఒక్క మహిళ అభ్యర్థి అయిన వాణిదేవిని అందరి సహకారంతో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.