‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ ట్రైలర్..

52

హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి కాంబినేష‌న్‌లో కొత్త ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఈ మూవీని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పింస్తుండగా.. నిర్మాతగా ‌బన్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న విడుదల కాబోతోంది. ఈ నేసథ్యంలో తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్..మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

శవాల వ్యాన్ నడిపే డ్రైవర్ గా కార్తికేయ అదిరిపోయే పాత్రలో కనిపించాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్ట‌ర్ వీడియోకు మంచి అప్లాజ్ వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో డి గ్లామర్ రోల్ లో నటిస్తుంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి.. అలాగే లావణ్య త్రిపాఠి గెటప్‌.. సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.

Chaavu Kaburu Challaga - Official Trailer | Kartikeya, Lavanya Tripathi | Koushik | #CKCTrailer