అమిత్ షాకు మంత్రి హరీశ్ రావు పంచ్‌..

7
Minister Harish Rao

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పై రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తాయి. అక్కడి ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తాయి. నచ్చిన తిండి తిని.. గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం రోజే తెలంగాణలో అమిత్ షా పర్యటన జరుగుతుండడం యాదృచ్చికం అంటూ మంత్రి హరీశ్‌ కౌంటర్‌ ట్వీట్ చేశారు.

కాగా, #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగుల‌ను ట్వీట్ చేశారు.