వ్యవసాయ శాఖకు వన్నె తెచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం..

178
minister harish
- Advertisement -

నాకు వ్యవసాయ శాఖను చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. వ్యవసాయ శాఖలో చూస్తే రిటైర్డ్ అయ్యాక ఉద్యోగంలో ఉన్న అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. మంగళవారం అబిడ్స్‌లోని జరిగిన తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం 2021 డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పనులను స్టార్ట్ చేసేటప్పుడు ఆ మట్టితో కలిగే ప్రయోజనాలు ఈ రిటైర్డ్ ఉద్యోగులు అవగాహన కల్పించారు. మా ఆర్ధిక శాఖ ద్వారా ఏమైనా సహకారం కావాలి అంటే తప్పకుండా అందిస్తాను. వ్వ్యవసాయ శాఖకు వన్నె తెచ్చింది మాత్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతులకు ఉచిత విద్యుత్ అంటున్నారు ఉచితంగా వస్తుందా నెలకు 1000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు కడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.ఇలా సంవత్సరం కు 12 వేల కోట్లు ఒక్క విద్యుత్ సంస్థకు కడుతుంది అంటే అర్థం చేసుకోవాలి. వ్యవసాయ శాఖ రంగానికి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమని మంత్రి తెలిపారు.

అప్పట్లో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో కరువు మంత్రిగా ఉన్న సీఎం కేసీఆర్ చింత మడకలో వ్యవసాయం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తరువాత కూడా చంద్రబాబు క్యాబినెట్ లో కందుకూరులో వ్యవసాయం చేశారు. ఇప్పుడు సీఎంగా ఉండి కూడా వ్యవసాయం చేస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ ఇలా రైతులకు కావాల్సిన ప్రతిదీ సీఎం కేసీఆర్ తెలుసు. అందుకే రైతు బంధు, రైతు భీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. జై జవాన్,జై కిసాన్ అని నినాదాలు చేసేవారు కానీ అవ్వన్నింటినీ నిజం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ మాత్రమే. అప్పట్లో అసెంబ్లీ లో పద్దులపై మాట్లాడాలి అంటే నకిలీ విత్తనాలు, కరెంట్ కోతలు సబ్సిడీ పై ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులకు గౌరవం దక్కాలి దాన్ని అధికారులు చొరవ చూపాలి. ఎంత ఇబ్బంది ఉన్న రైతులకు రైతు బంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందన్నారు.

ఇప్పటికే 6014 కోట్ల రూపాయిలు రైతుల ఖాతాలో జమ చేశాము. మిగతా డబ్బులు కూడా ఒకటి రెండు రోజుల్లో జమ చేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలని కోరిన ఇవ్వలేదు. మనమందరం రైతులకే సేవ చేసే వ్యక్తులం. క్షేత్ర స్థాయిలో మీరు తిరిగితే వ్యవసాయ రంగంకు మరింత ముందుకు పోతుంది. రైతుకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలి. పంట మార్పిడి పై రైతుకు అవగాహన కల్పించాలి. దేశానికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగం ఆదర్శంగా ఉంది. ఇప్పటికే రైతు బంధు, రైతు భీమాతో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. వాన కాలంతో పోటీగా యసంగి వరి సాగు జరుగుతుంది అంటే ఇది తెలంగాణ సాధించిన విజయం అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -