అర్హులందరికీ రేషన్ కార్డులు: గంగుల

61
gangula

అన్నార్థులుండని తెలంగాణని సాకారం చేసే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దిన్ ఓవైసి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ మోజమ్ ఖాన్, జాఫర్ హుస్సెన్, సయ్యద్ అమ్మద్ పాషా ఖాద్రి, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కౌసర్ మోహియుద్దిన్ లు అడిగిన రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డుల జారీకోసం ప్రభుత్వానికి వేలాది దరఖాస్తులు అందాయా, ఇప్పటివరకూ ఇచ్చిన కార్డులెన్ని అని అడిగిన ప్రశ్నకు మంత్రి గంగుల సమాదానం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకూ రేషన్ కార్డుల కోసం 9,53,394 అప్లికేషన్లు వచ్చాయని వీటిలో 6,70,999 అర్హమైనవిగా తేల్చి నూతన రేషన్ కార్డులు ఇచ్చామన్నారు, వీటి ద్వారా 21,30,194 మంది లబ్దీపొందుతున్నారని తెలియజేసారు మంత్రి గంగుల.

అనంతరం సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నలు కార్డులు ఎందుకు రిజెక్ట్ చేస్తారు, రేషన్ డీలర్లను పెంచండి, అప్లికేషన్లు తీసుకొని కొత్త కార్డులు ఇవ్వాలని అడిగిన వాటికి సైతం మంత్రి గంగుల సమాధానాలు తెలియజేశారు.2016 లో 94,417 కార్డులు, 3,30,459 లబ్దీదారులు, 2017లో 36,039 కార్డులు, 1,26,136 లబ్దీదారులు, 2018లో 1,65,036 కార్డులు, 5,77,626 లబ్దీదారులు, 2019లో 64,471 కార్డులు, 2,25,649 లబ్దీదారులు, 2020 లో 11 కార్డులు, 39 లబ్దీదారులు, 2021లో 3,11,025 కార్డులు, 8,70,285 లబ్దీదారులు ఉన్నారన్నారు.
 
ఆహార భద్రతా కార్డులపై సమగ్ర సమాచారం సభకు అందించారు. ప్రభుత్వం 2021 సెప్టెంబర్లో నూతనంగా 8,70,285 లబ్దీదారులకు3,11,025 కార్డులను అందించిందన్నారు, ప్రభుత్వం వద్ద అప్పటివరకూ ఉన్న 4,99,525 అప్లికేషన్లలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వెరిఫికేషన్ తర్వాత 4,80,782, 360 డిగ్రీ సాప్ట్వేర్ వెరిఫికేషన్ తర్వాత అర్హమైన 4,18,037 అప్లికేషన్లలో 74 శాతం 3,11,025 నూతన కార్డులకు అర్హత సాధించాయని, 26 శాతం 1,07,012 అనర్హత పొందాయన్నారు, అగ్రికల్చర్ లాండ్ ఎక్కువగా ఉండడం, ఇదివరకే కార్డులో పేరు నమోదై ఉండడం, కార్లు కలిగి ఉండడం, టాక్స్ పేయర్లు, ప్రొపెషనల్స్, రిటైర్డ్ పెన్షనర్స్, వివిద శాఖల ప్రభుత్వ ఉద్యోగులు వంటి ఇతరత్రా కారణాలతో అనర్హలుగా తేలారని చెప్పారు. అర్హతల క్రైటీరియా ప్రకారం గ్రామాల్లో లక్షన్నర సంవత్సరాదాయం, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వార్షికాదాయం, మూడున్నర ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాల మెట్ట భూమి వరకూ ఉన్నకుటుంబాలు అర్హులన్నారు.

కేంద్ర పథకం లోని కార్డులను 2013 ఎన్ఎఫ్ఎస్ఏ ఆక్ట్ ప్రకారం తెలంగాణలో 191.696 లక్షల లబ్దీదారులకు మించి పెంచడానికి లేదన్నారు, అయితే గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఒక నిరుపేద కూడా ఆకలితో ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కార్డులను మంజూరు చేసిందన్నారు 36.92 లక్షల కార్డులు, 95.98 లక్షల లబ్దీదారులు రాష్ట్రం పరిదిలో ఉన్నారన్నారు మొత్తంగా తెలంగాణలో 90.49 లక్షల కార్డులు, 2 కోట్ల 87లక్షల 68వేల లబ్దీదారులు ఉన్నారని తెలిపారు.

జూన్ 8 2021న గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుండి పదవ తారీకు వరకు అప్లికేషన్లు తీసుకున్నామన్నారు, ఆ రెండు రోజుల్లో సైతం 800లకు పైగా అప్లికేషన్లు వచ్చాయన్నారు కొత్త కార్డుల అప్లికేషన్ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. హైదరాబాద్ పరిధిలోని కార్వాన్, యాకుత్పుర నియోజకవర్గాల కార్డుల స్టేటస్ తెలియజేశారు. Yakutpura lo మొత్తం 50079 కార్డులు ఉన్నాయని కొత్త కార్డులను 2434 చేశామన్నారు, కార్వాన్ నియోజకవర్గంలో 51568 కార్డులు ఉన్నాయని కొత్త కార్డులను 13099 ఇచ్చామన్నారు.