మంత్రి హరీష్‌రావుని కలిసిన ఈటల బంధువులు..

46
harish

మంత్రి హరీష్‌ రావుతో భేటీ అయ్యారు కమలాపూర్ గ్రామస్తులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బంధువులు. హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈటల పైరవీలు చేసుకుని కోట్ల రూపాయలకు ఎదిగారని ఆయన తనకు సంబంధించిన కొద్దిమంది మాత్రమే ఆ ధరించాడని మమ్మల్ని ఏనాడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కమలాపూర్ గ్రామస్థులు

ఈటల రాజేందర్ సోదరి తమ మత్స్యకారుల సంఘ భవనానికి తాళం వేసిందని, తమ ఇంట్లో పురుషులపై పోలీసు కేసులు పెట్టి వేధించారని హరీష్‌ రావుకి తెలిపారు గ్రామస్తులు. ఈటల తమను ఏనాడు ఆదరించ లేదని…ఈటల వీధిలోనే నివాసము ఉంటామని తమ బాగోగులు పట్టించుకోకపోగా తమపైనే పోలీసు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని తెలపగా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని తాను ఇకముందు అండగా ఉంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.