టీఆర్ఎస్‌ లేకుంటే ఈటల ఎక్కడ ఉండేవాడు:గంగుల

52
gangula

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మరోసారి ఫైరయ్యారు మంత్రి గంగుల కమలాకర్. టీఆర్ఎస్‌ లేకుంటే ఈటల రాజేందర్ ఎక్కడ ఉండేవాడని ప్రశ్నించారు. జమ్మికుంట ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన గంగుల… తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎంతో గౌరవించిందన్నారు.

పార్టీలో 20 సంవత్సరాలుగా అనేక పదవులు అనుభవించి కన్న తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఈటల టీఆర్ఎస్‌ని చీల్చే కుట్ర పన్నారు…కేసీఆర్ బొమ్మ మీద గెలిచి పార్టీపై ధిక్కార స్వరం వినిపించడం ఆయనకే చెల్లింది అన్నారు.

తెలంగాణ వ్యతిరేకులైన బీజేపీ, కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని అది ఇప్పుడు బహిర్గతమైందన్నారు గంగుల. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధైర్య పడవద్దని సూచించి గంగుల అందరికి అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.