పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఈటల

177
etela
- Advertisement -

కరీంనగర్,మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి, ఈ వర్షాలతో వాగులు వంకలు పోగడమే కాకుండా చెరువులు నిండి ఉన్నాయి. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున, ఇంత తక్కువ కాలంలో వర్షం పడటం అరుదుగా జరుగుతుంది. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంటపొలాలు, కూలిపోయిన ఇళ్ళ విషయంలో ఇప్పటికే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ ,రెవెన్యూ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు.

జరిగిన సంఘటన అన్నింటిని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయ చర్యలు సహాయ సహకారాలు అందిస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఇప్పుడు వెంటనే ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారాన్ని కావలసిన సహకారాలు అందిస్తాము.రైతాంగానికి పంట నష్టం పై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారని తెలిపారు.

ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సిఎస్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారు. అవసరం ఉన్నంచోట ప్రజలను షెల్టర్ లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలన్నారు.

- Advertisement -