Covid-19 పై భేటీ అయిన స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ

358
etela
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి ఈటల రాజేందర్. కోవిద్ 19పై జరిగిన స్టేట్ కో ఆర్డినేషన్ కమిటీ భేటీలో మాట్లాడిన ఆయన గాంధీ ఆసుపత్రిలో covid-19 పాజిటివ్ తో చేరిన వ్యక్తి కి పూర్తిగా నయం అయ్యింది… డిశ్చార్జ్ చేయబోతున్నాం అన్నారు.
ఇప్పటికి ఒక్క కేసు కూడా పాజిటివ్ లేదని..విమానాశ్రయంలో ప్రతి విదేశీ ప్రయాణీకులను స్క్రీన్ చేస్తున్నాం అని తెలిపారు.

బయటి దేశం నుండి వచ్చే వారు ఖచ్చితంగా 14 రోజులు ఇంట్లోనే (ఐశోలేషను) లో ఉండాలి. కుటుంబసభ్యులను కానీ, బయటి వారిని ఎట్టిపరిస్థితుల్లో కలవవద్దన్నారు. విదేశాలనుండి వచ్చే వారికి 104 కాల్ సెంటర్ నుండి ఫోన్లు వస్తాయి, దయచేసి సమాచారం ఇవ్వాలన్నారు.

విదేశాలనుండి వచ్చే వారి ద్వారా మాత్రమే తెలంగాణ గడ్డ మీదికి covid-19 వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి సహకరించాలని సూచించారు.సోషల్ మీడియా లో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు ఈటల.

సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేసిన ఆయన బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించ వద్దన్నారు. కాన్ఫరెన్స్ లు/ సెమినార్ లు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రత్యేక అధికారి శ్రీదేవి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ పాల్గొన్నారు.

- Advertisement -