ప్రజల ముందుకే వైద్యం: మంత్రి ఈటల

236
etela
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కెసిఆర్ ఆలోచన మేరకు నిరుపేదల ముంగిటికే వైద్యం అందించేందుకు బస్తీ దావాఖానాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ గాంధీనగర్, బోయగూడ లో బస్తి దావాఖనాను ప్రారంభించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.

వందలాది బస్తీల్లో నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు ఉంటున్న స్థలాలు…ఇందులో ఒక డాక్టర్, ఒక నర్సు,అనుబంధ స్టాఫ్ తో సేవలు అందిస్తున్నారు.ఈ బస్తీ దావాఖనలో ఎలాంటి రోగం వచ్చిన మందులు అందిస్తారని చెప్పారు.

అవసరం అయిన వారికి రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నస్తిక్స్ కి పంపి పరీక్షలు కూడా చేస్తారు. వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా పెద్ద దవాఖానాలకు పంపిస్తారు.ప్రస్తుతం GHMC లో 168 బస్తీ దావాఖానా లు పని చేస్తున్నాయి.ఈ రోజు 25 దావాఖనాలు ప్రారంభించాము…కరోనా సందర్బంగా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.

జలుబు, జ్వరం , ఒళ్ళు నొప్పులు వేస్తే ఏం కాదులే అని ఇంట్లో పడుకొకండి. వెంటనే హాస్పిటల్ కి రండి. 4,5 రోజులు అలాగే ఉంటే శ్వాస సంబంధ సమస్యలు వచ్చి బ్రతికించుకోవడం కష్టం అవుతుంది కాబట్టి నిర్లక్షం చేయవద్దన్నారు.

- Advertisement -