డెంటల్ వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలి

522
etela rajendar

డెంటల్ వైద్యులు గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలని సూచించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ తెలంగాణ డెంటల్ కాన్ఫరెన్స్ మాదాపూర్ సైబర్ కన్వెన్సన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజెందర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ… విజ్ఞానం, ఆరోగ్య సాధనతోనే బంగారు తెలంగాణ సాధ్యం. వైద్య వృత్తిని అత్యంత సేవాభావంతో నిర్వహించాలి. ఇప్పుడు జెనెటిక్స్, సైన్స్‌కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలి. కొత్త దంత కళాశాలల ఏర్పాటు కంటే .. ఉన్న వైద్యులనే సరిగా వినియోగించుకోవాలి.

వైద్యులు లోకజ్ఞానం కూడా పెంచుకోవాలి. సమాజంలో స్త్రీ కన్నీరు పెండుతుంది. సమాజానికి అది మంచిది కాదు. శాస్త్రవిజ్ఞానాన్ని మానవ కల్యాణం కోసం వాడాలి. తెలంగాణ రాష్ట్రం మానవ సంబంధాలపై కూడా దృష్టి పెడుతుంది. ఆరోగ్యంలో దేశంలో నంబర్‌వన్ స్థానానికి చేరుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.