వరంగల్ రూరల్ జిల్లాలోని తన స్వగ్రామం పర్వతగిరికి వెళుతూ మార్గమధ్యంలో ఖిలా వరంగల్ మండలం గాడిపెల్లి ప్రజలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం రాత్రి పలకరించారు.
గాడిపెల్లిలో ఇళ్ళముందు కూర్చుని ముచ్చటిస్తున్న ప్రజల దగ్గరకు నేరుగా వెళ్ళిన మంత్రి, యువకులను ఎవరెవరు ఎవరెవరి కొడుకలంటూ ఆరా తీశారు. వారి తల్లిదండ్రుల పరిచయంతో వాళ్ళతో కాసేపు మాట్లాడారు. ఏం చేస్తున్నారని వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆపక్కనే ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వెళ్ళి, వాళ్ళ పక్కనే కూర్చున్నారు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడారు. వాళ్ళు మంత్రిని గుర్తుపట్టి, ఈ రోడ్లన్నీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేసినవి. పలానా అభివృద్ధి పని మీ ద్వారానే జరిగిందంటూ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
కాగా అక్కడే తన ఇంట్లో పనులు నిర్వర్తించే ఉప్పమ్మ కనిపించడంతో… ఆమెను పలకరించారు. ఇల్లు బాగా కడుతున్నట్లున్నవు అంటూ పకలరించారు. ఇలా తన చిన్ననాటి, తాను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పటి జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. అత్యంత సాదా సీదాగా జనంత కలిసిపోయే జన నేత అయిన దయన్న, ఇలా మరోసారి కలిసిపోవడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు. దయన్న నిజంగానే దయన్నరా అంటూ… అంతా చర్చించుకున్నారు.