ఫ్యాన్సీ రేటుకు ”సూపర్ డిలక్స్” తెలుగు రైట్స్..!

28
sam

స్టార్ హీరోయిన్ సమంతా బ్రిలియట్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన సినిమా సూపర్ డిలాక్స్. తమిళ్ లో ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది.

తెలుగులో సమంత కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. అలాగే తెలుగులో విజయ్ సేతుపతికి కూడా మంచి పేరుంది. వీరిద్దరూ కలిసి నటించిన సూపర్ డీలక్స్ సినిమా తెలుగు రైట్స్ ను సిద్దేశ్వర వైష్ణవి ఫిలింస్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. కుమారరాజ త్యాగరాజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటించింది. నిర్మాత పి.మధుబాబు ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.