ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా చూడండి: ఎర్రబెల్లి

27
errabelli

భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వర్షాలు తీవ్రంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందిపడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ సమన్వయంతో కృషి చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.