కరోనా నిబంధనల మధ్య ఎన్నికల ప్రచారం:శశాంక్ గోయల్

138
shashank
- Advertisement -

అక్టోబర్ 30 న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్….నవంబర్ 2 పలితాలు వెలువడుతాయని తెలిపారు ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్. నామినేషన్ సంబంధించి ఎలాంటి ర్యాలీ లకు అనుమతి లేదని….మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు.

ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు పాటించాలి….స్టార్ కంపైనర్ లిస్ట్ కూడా కుదించినట్లు తెలిపారు.రోడ్ షో లు, మోటార్ ర్యాలీలకు అనుమతి లేదని…ఇంటింటికీ ప్రచారంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.

పోలింగ్ కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలన్నారు.వెహికిల్ లో కూడా పార్టీ ల నేతలు కోవిడ్ నిబంధనలు పాటించాలి…కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశాం అన్నారు.ప్రతి ఒక్కరు కేంద్ర ఎన్నికల నిబంధనలు పాటించాలి…అధికారులకు కూడా సూచిస్తున్న కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. ఇవాల్టి నుండి మెడల్ కోడ్ ఉంటుంది… అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను ఇప్పటికే పరిశీలించాం అన్నారు.

305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి….47 పోలింగ్ కేంద్రాల్లో 1000 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.మొత్తం 2,364,30 ఓటర్లుండగా వయోవృద్ధుల కు,దివ్యాంగులకు, కోవిడ్ పేషేంట్ లకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం అన్నారు.

కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వారు పోలింగ్ వారం ముందు వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.ఆన్ గోయింగ్ ప్రభుత్వ పథకాలు యధావిధిగా కొనసాగుతాయని….ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కూడా త్వరలోనే ఉంటుందన్నారు.మిగత రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు శశాంక్.

- Advertisement -