కృష్ణవంశీ…రంగమార్తాండ

45
krishna vamshi

చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ. మరాఠి క్లాసిక్‌ నట సామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రంగ మార్తండ అనే టైటిల్‌ని ఖరారు చేయగా ఈ మూవీలో ప్రకాజ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వాస్తవంగా ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ‘రంగమార్తాండ’ చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి కరోనా వేవ్స్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు కృష్ణవంశీ.

రంగమార్తాండ సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలైంది.. అంటూ షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక ఈ ఫొటో చూస్తుంటే శివాత్మికకు సంబంధించి షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.