కరోనా వైరస్‌పై భయాందోళన చెందవద్దన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో పర్యటించిన ఎర్రబెల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ లేదు…విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న వాళ్ల ద్వారా ఈ వైరస్ మనదేశంతో పాటు రాష్ట్రంలోకి ప్రవేశించిందని తెలిపారు. రాష్ట్రంలో వైరస్ విజృంభించకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు.
దగ్గు,జలుబు,జ్వరం వచ్చిన వాళ్లు మిగితా వాళ్లకు దూరంగా ఉండాలన్నారు. వైరస్ సోకిన వారితో పాటు వ్యాధి సోకకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. మనం శుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలు కొంతకాలం పాటు తమ పనులను వాయిదా వేసుకోవాలన్నారు.