బీజేపీ నేతలు దమ్ములేని దద్దమ్మలు: ఎర్రబెల్లి

197
dayakarrao
- Advertisement -

బీజేపీ నేతలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీజేపీ నేతలు దమ్ములేని దద్దమ్మలు,చేతగాని చవటలు అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి…రాష్ట్రానికి ఏమి చేయలేదు. కనీసం మీ నియోజకవర్గాల్లో ఏం చేశారో చెప్పండని నిలదీశారు.

మీ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి ఒక్కటైనా చెప్పగలరా? అలాంటి మీరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి సీఎం కేసీఆర్‌ను తిడుతారా అని మండిపడ్డారు. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఇస్తే అందులో పావుల వంతు అయినా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కేటాయించలేదన్నారు.

నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇంట్లో పెట్టుకున్నావా? మొన్న మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీల్లో మీరు ప్రతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్‌కు ఒక్క కాలేజీ అయినా తెచ్చుకున్నారా? అని ప్రశ్నించారు. ఒక్క ఎంపీ కూడా గెలవని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 4 మెడికల్ కాలేజీలు ఇచ్చారన్నారు. దయచేసి పట్టభద్రులు అందరూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -