- Advertisement -
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..శ్రీకాంత్ చారి తెలంగాణ మలి దశ ఉద్యమంలో మొదటి అమరుడు అన్నారు.
శ్రీకాంత్ చారి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయాడు…అతి చిన్న వయస్సులో స్వరాష్ట్రం కోసం అమరుడు అవ్వడం బాధాకరం అన్నారు. ఆయన త్యాగాన్ని గుర్తించి వారి తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం…వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
- Advertisement -