జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేద్దాం..

41
errabelli dayakar

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేద్దామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమాయత్త సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి బిజీ పాల్గొంటున్నారు. హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ పార్టీ ముఖ్యులతో సమావేశమైయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన మంత్రి.. ఆయా నేతలకు దిశా నిర్దేశం చేసిన చేశారు. ఈ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 4వ డివిజన్, మీర్ పేట హౌసింగ్ బోర్డులో అందరం కలిసి కట్టుగా ప్రచారం చేద్దామన్నారు. మన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లుదాం. ప్రభుత్వ విజయాలతో పాటు, ప్రతిపక్ష వైఫల్యాలను ప్రజలకు చెబుదామని.. ప్రజల్లో టీఆర్‌ఎస్‌ బలమెంటో ప్రతిపక్షాలకు చూపెడదామని మంత్రి తెలిపారు.