బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 71 హైలైట్స్

39
episode 71

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 71 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 71వ ఎపిసోడ్‌లో భాగంగా హౌస్‌ నుండి మెహబూబ్ ఎలిమినేట్ కావడం,ఇంటి సభ్యుల ఎమోషన్‌తో గడిచిపోయింది.

సన్‌డే ఫన్ డే లో భాగంగా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు నాగ్‌. తొలి ఫన్‌ గేమ్‌లో భాగంగా ఇంటిస‌భ్యుల‌తో గ‌ద్ద కుందేలు ఆట ఆడించారు. మొద‌ట గ‌ద్ద‌గా మారిన అభి కుందేలుగా ఉన్న ఇంటిస‌భ్యుల్లో నుంచి అఖిల్‌ను ప‌ట్టుకుని గద్ద‌గా మార్చేశాడు. ఇలా గేమ్ పూర్త‌య్యేస‌రికి అంద‌రూ గ‌ద్ద‌లుగా మారిపోగా సోహైల్‌ విన్నర్‌గా,అరియానా రన్నరప్‌గా నిలిచింది. ఒకరిని సేవ్ చేయడంలో భాగంగా బిగ్ బాస్ పంపించిన చిట్టిని చదివి అరియానా సేవ్ అయినట్లు తెలిపాడు అభిజిత్.

తర్వాత ఒక‌రు బొమ్మ గీస్తే మిగ‌తావాళ్లు దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా పేరు చెప్పాల్సి ఉంటుందని…సోహైల్ లీడ‌ర్‌గా అవినాష్‌, అఖిల్‌, హారిక ఒక టీమ్‌, అరియానా లీడ‌ర్‌గా మెహ‌బూబ్‌, లాస్య‌, అభిజిత్‌, మ‌రో టీమ్‌గా విడిపోయారు. మోనాల్ సంచాల‌కురాలిగా వ్య‌వ‌హ‌రించింది. ఆట మధ్యలో మోనాల్ సేవ్ కాగా సినిమా పేర్ల‌ను కనుక్కునే గేమ్‌లో అరియానా టీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది సోహైల్ టీమ్. గేమ్ అనంతరం హారిక సేవ్ కాగా ఇక చివరగా మిగిలింది స్నేహితులైన సొహైల్,మెహబూబ్.

స‌క్సెస్ కోసం ప‌దేళ్లుగా క‌ల కంటున్నా అని సోహైల్‌ తెలపగా క‌ష్ట‌ప‌డుతున్నాను కానీ దుర‌దృష్టం వెంటాడుతోంద‌ని మెహ‌బూబ్ బాధ‌ప‌డ్డాడు. సోహెల్, మెహబూబ్‌లను రెండు పెద్ద బల్బుల వద్ద నిలబెట్టి మెహబూబ్‌కు ఎర్ర రంగు బల్బు వేసి ఎలిమినేట్ చేశారు.మెహబూబ్ ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులంతా కంటతడి పెట్టారు. ముఖ్యంగా సొహైల్ కన్నీటిపర్యంతం అవడం అందరిని కలిచివేసింది. టాప్ 5లో ఉంటామంటూ ఇప్పుడు వెళ్లిపోతున్నాడ‌ని ఏడ్చేశాడు.

అభిజిత్,హారికతో సహా అంతా కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక స్టేజ్ మీదకు వెళ్లిన మెహబూబ్ అందరి గురించి పాజిటివ్‌గా చెప్పి కన్నీళ్లు పెడుతూనే ఉన్నాడు. ఇక చివరగా ఇంటి సభ్యుల కోసం ఓ పాటకు డ్యాన్స్‌ చేస్తూ ఎమోషన్‌కు గురిచేశాడు. మెహబూబ్ వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబును అవినాష్‌పై వేశాడు. ఇది కూడా అవినాష్ ఇష్టంతోనే. ఒక వారం అవినాష్ నాన్ వెజ్ తినకూడదు, గుడ్డుతో సహా.దీంతో ఎపిసోడ్ ముగిసింది.