కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌పై ప్రశంసలు గుప్పించారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్…కామారెడ్డి అభివృద్ధి పనుల కోసం రూ.45 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కామారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మున్సిపల్ డిపార్ట్‌మెంట్ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం రూ. 20 కోట్లు మంజూరు చేయాలని, కోరగా తానూ మంజూరు చేసినట్లు తెలిపారు. సౌమ్యుడైన గంప గోవర్ధన్ కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చి, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్ కళాశాల, సువిశాల రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేస్తున్నారని ప్రశంసించారు.
Also Read:ఆమె మరో సాయి పల్లవి అవుతుందా?
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కామారెడ్డికి ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. అడుగడుగునా మంత్రి కేటీఆర్‌కి ఘనంగా స్వాగతం పలికారు.