మెట్ లైఫ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్

53
- Advertisement -

హైదరాబాద్ లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మరియు బీమా సేవల సంస్థ మెట్ లైఫ్. ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారుతున్నది. ఇదే క్రమంలో ఈరోజు మరో ఆర్థిక సేవలు, భీమా దిగ్గజ సంస్థ మెట్ లైఫ్ హైదరాబాద్ నగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్ లైఫ్ కేంద్ర కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు సంస్థ సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు.

మెట్ లైఫ్ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక మందికి భీమా మరియు ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థగా పేరుగాంచింది. అమెరికా ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న ఇంత పెద్ద సంస్థ హైదరాబాద్ నగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మెట్ లైఫ్ సంస్థ నిర్ణయం దోహదం చేస్తుందదన్నారు.

Also Read:నిజాయితీగా కొత్త సినిమా తీశాం:కార్తీకేయ

- Advertisement -