కృష్ణగాడి వీరప్రేమగాథతో తెలుగు తెరకు పరిచయమయిన నటి మెహ్రీన్. మొదటి సినిమాతోనే ఆడియన్స్ మనసు దొచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమా తర్వాత మెహ్రీన్ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక చాలా రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్‌గా ఉంటుంది మెహ్రీన్. తాజాగా ఇన్‌స్టాలో ఒక ఫోటో తెగ హల్‌చల్ చేస్తుంది.
మెహ్రీన్ ముఖంపై సూదులతో గుచ్చినట్టుగా ఉన్న ఓ ఫోటోను తన ఇన్ స్టాలో తెగ వైరలవుతుంది. దీంతో మెహ్రీన్ కు ఏమైందంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ప్రస్తుతం మెహ్రీన్ తన అందానికి మరింత మెరుగులు దిద్దుతున్నట్లు అనిపిస్తోంది. ఈ థెరపీని ఆక్యు స్కిన్ లఫ్ట్ అంటారని.. ఓ డాక్టర్ పర్య వేక్షణలో చికిత్స చేయించుకుంటున్నట్లుగా హీరోయిన్ తెలిపింది.
ఇవి కూడా చదవండి…